మూడు రోజులు విధుల బహిష్కరణ 

Abdullapurmet Tahsildar Murder: Revenue Employees Calls Deportation Of Duties For Three Days - Sakshi

తహసీల్దార్‌ హత్యకు నిరసనగా ట్రెసా పిలుపు  

సాక్షి, హైదరాబాద్‌: తహశీల్దార్‌ విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మహిళా అధికారిని హత్య చేయడం అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని ఓ ప్రకటనలో ఖండించారు. విజయారెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు రెవెన్యూ ఉద్యోగులంతా హైదరాబాద్‌ తరలిరావాలని కోరారు. నిందితుల వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, మహిళా ఉద్యోగులకోసం రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

ఉద్యోగులకు రక్షణ కల్పించాలి: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ 
తహసీల్దార్‌ విజయారెడ్డి దారుణహత్యకు గురికావడం దురదృష్టకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్‌రెడ్డి, వి.మమత అన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్‌ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్‌ అధికారుల పెన్షనర్లు, కారి్మకుల ఐక్యత కార్యాచరణ సమితి ప్రగాఢ సానుభూతి తెలిపింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top