డీసీఎం వ్యాను బీభత్సం : ముగ్గురు మృతి | 3 dies after Van hits Pedestrians in nalgonda | Sakshi
Sakshi News home page

డీసీఎం వ్యాను బీభత్సం : ముగ్గురు మృతి

Feb 3 2018 8:17 AM | Updated on Aug 30 2018 4:15 PM

3 dies after Van hits Pedestrians in nalgonda - Sakshi

నల్లగొండ : నల్లగొండ బైపాస్ రోడ్ లో అర్జలబావి దగ్గర డీసీఎం వ్యాను బీభత్సం సృష్టించింది. నార్కెట్‌పల్లి అద్దంకి రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురు యువకులను డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ సంతాప సభ జిల్లా కేంద్రంలో జరగనున్న నేపథ్యంలో టెంటూ క్యాటరింగ్ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ నుండి యువకులు వచ్చినట్లు తెలుస్తోంది. అద్దంకి నార్కెట్‌పల్లి రోడ్డులోని మర్రిగూడ బైపాస్ వద్ద బస్సు దిగాల్సి ఉండగా, యువకులు తెలియక ముందుకెళ్లి దిగారు. అక్కడి నుండి తిరిగి నడుచుకుంటూ వస్తున్న ఈ యువకులను డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు. మృతులు కృష్ణా జిల్లా చెన్నూరుకు చెందిన హేమంత్‌, అదే జిల్లా కంచికర్లకు చెందిన వాసిరెడ్డి మురళి, కీసరకు చెందిన సనీల్‌ గా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement