ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు మృతి | 2 dies as tractor turns turtle in nizambad district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు మృతి

Oct 7 2015 9:56 PM | Updated on Sep 3 2017 10:35 AM

ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

బాన్సువాడ(నిజామాబాద్): ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన బుధవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ తండాలో చోటుచేసుకొంది.

బాన్సువాడ పోలీసులు తెలిపిన వివరాలప్రకారం...తండాకు చెందిన బరావత్ లకియ బాయి బుధవారం ఇద్దరు కొడుకులు రాజు, రవీందర్‌తోపాటు కోడళ్లు హన్నీబాయి(20), సీతాబాయి (20)తో పొలానికి ట్రాక్టర్‌లో బయలుదేరారు. అయితే, నాగ్లూర్ సమీపంలో మలుపులో వారి ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న హన్నీబాయి, రాజు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ నడుపుతున్న రవీందర్, లకియాబాయి, సీతాబాయిలకు తీవ్రగాయాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement