ఉరి నుంచి ఊరికి! | Sri Lanka prison to Relief for 5 fishermens | Sakshi
Sakshi News home page

ఉరి నుంచి ఊరికి!

Nov 22 2014 2:56 AM | Updated on Nov 9 2018 6:35 PM

తమిళనాడు ప్రజలు శుక్రవారం ఆనందంలో మునిగిపోయూరు. మత్స్యకారుల కుటుంబాల్లో సంతోషం కట్టలు తెంచుకుంది.

చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు ప్రజలు శుక్రవారం ఆనందంలో మునిగిపోయూరు. మత్స్యకారుల కుటుంబాల్లో సంతోషం కట్టలు తెంచుకుంది. శ్రీలంక చెర నుంచి విముక్తి పొందిన ఐదుగురు జాలర్లు చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి ఘన స్వాగ తం లభించింది. రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యూయి. రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపం తంగచ్చిమండపానికి చెందిన ఎనిమిది మంది జాల్లర్లు హెరాయిన్ మత్తుపదార్థాలను చేరవేస్తుండగా తాము అరెస్ట్ చేసినట్లు 2011 నవంబర్ 28న శ్రీలంక గస్తీదళాలు ప్రకటించాయి.

ఈ కేసుపై 35 నెలల తర్వాత వాదోపవాదాలు ముగియగాపట్టుబడిన 8 మంది తమిళ జాలర్లలో అగస్టస్, ఎవర్సన్, లింగ్లెట్, ప్రసాద్, విల్సన్ అనే ఐదుగురు మత్స్యకారులకు ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30వ తేదీన శ్రీలంక కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పువెలువడిన వెం టనే రాష్ట్రం యావత్తు గగ్గోలు పెట్టగా, ఆ వేడి కేంద్రప్రభుత్వానికి తాకింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనలు నిర్వహించాయి.

దీని ఫలితంగా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 9వ తేదీన టెలిఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో రాజపక్సే ఐదుగురు జాలర్లకు క్షమాభిక్ష పెట్టారు. గురవారం రాత్రి వారందరినీ సురక్షితంగా ఢిల్లీకి చేర్చారు. అక్కడి నుంచి చెన్నైకి చేరుకున్నారు.
 బీజేపీ, అన్నాడీఎంకే పోటాపోటీ: మత్స్య కారులను విడిపించిన ఘనతను చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పోటీపడ్డాయి. రెండుపార్టీలూ విమానాశ్రయంలో హైడ్రామా సృష్టించాయి.

షెడ్యూలు ప్రకారం విమానం గురువారం రాత్రి 12.40 గంటలకు చెన్నైకి చేరుకోవాల్సి ఉంది. జాలర్లకు ఘనస్వాగతం పలికేందుకు కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తదితర 300 మంది విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రి వలర్మతి తదితరులు మరోవైపు సిద్ధమయ్యూరు. జాలర్లు విమానం నుంచి దిగగానే స్వాగతం, మీడియాతో సమావేశం తరువాత వారి స్వస్థలాకు చేర్చేందుకు బీజేపీ వారు వాహనాలు సైతం సిద్ధం చేశారు. అయితే అన్నాడీఎంకే బృందం విమానాశ్రయంలోకి వెళ్లి జాలర్లను మరో మార్గం గుండా రోడ్డుపైకి తీసుకువచ్చి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించింది.

దీంతో విస్తుపోయిన బీజేపీ నేతలు వెనుదిరిగారు. బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య గంటపాటు విమానాశ్రయంలో  హైడ్రామా నడిచింది. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ జాల్లర విడుదల అంశాన్ని అడ్డుపెట్టుకుని తాము రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నించడం లేదన్నారు. లబ్ధి ఆలోచనే ఉంటే జాలర్లు ఢిల్లీ చేరగానే ప్రధాని నరేంద్రమోదీ వద్దకు తీసుకువెళ్లేవారమని అన్నారు. ఇదిలా ఉండగా మూడేళ్లుగా ఇళ్లు విడిచి వెళ్లిన జాలర్లు జీవితంలో నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తలా రూ.3 లక్షలు అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శుక్రవారం ప్రకటించారు.
 
జాలర్లకు బ్రహ్మరథం: జాలర్ల విడుదలతో బీజేపీ నేతలు ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కావడం, ఇదే రోజున జాలర్లు విడుదల చేయడంతో బీచ్ రోడ్డులో ‘మీన్ ఉనవు ఉన్నుం విళా’ పేరుతో సందడి చేశారు. ఎనిమిది రకాల చేపలతో తయారుచేసిన వంటకాలను ప్రజలకు పంచిపెట్టారు. ప్రధాని మోదీ, సుష్మాస్వరాజ్‌కు అభినందన సభ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఉదయం 9 గంటకు రామనాథపురం, మధ్యాహ్నం 12 గంటలకు తంగచ్చిమండంకు చేరకున్న ఐదుగురు జాలర్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ఇంటికి చేరుకోగానే వారి భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు ఆలింగనం చేసుకుని ఆనందబాష్పాలు రాల్చారు. ఇదిలావుండగా జాలర్లకు ఉరిశిక్షపై క్షమాభిక్ష ప్రసాదించామేగానీ హెరాయిన్ అక్రమరవాణా కేసులను కొట్టివేయలేదని శ్రీలంక మంత్రి సెంథిల్ తొండమాన్ రెండురోజుల క్రితం ప్రకటించారు. ఐదుగురు జాలర్లను ఖైదీలుగానే అప్పగిస్తున్నామని అన్నారు. శ్రీలంక మంత్రి వ్యాఖ్యలతో మళ్లీ జాలర్లను భారత్ జైళ్లలో పెడతారేమోననే సందేహం బయలుదేరింది. అయితే ఎట్టకేలకు వారంతా సురక్షితంగా ఇళ్లకు చేరడంతో అందరూ ఆనందపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement