‘కేఆర్‌ఎస్’ ఇక శత్రుదుర్బేధ్యం | KRS The satrudurbedhyam | Sakshi
Sakshi News home page

‘కేఆర్‌ఎస్’ ఇక శత్రుదుర్బేధ్యం

Jan 12 2014 2:00 AM | Updated on Sep 2 2017 2:31 AM

దక్షిణ కర్ణాటకలోని చాలా భాగాలకు సాగు, తాగునీరు అందించే కృష్ణరాజసాగర డ్యాం (కేఆర్‌ఎస్) ఇక శత్రుదుర్బేధ్యం కానుంది.

సాక్షి, బెంగళూరు : దక్షిణ కర్ణాటకలోని చాలా భాగాలకు సాగు, తాగునీరు అందించే కృష్ణరాజసాగర డ్యాం (కేఆర్‌ఎస్) ఇక శత్రుదుర్బేధ్యం కానుంది. ఈ కట్టడానికి ప్రత్యేక శిక్షణ పొందిన అధికారులతో పహారా పాటు నిఘా కోసం అత్యాధునిక సీసీ కెమరాలు వినియోగించనున్నారు.

రాష్ట్రంలో ఇటీవల ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి ముష్కరులు రాష్ట్రంలోని చారిత్రాత్మక కట్టడాలతో పాటు ముఖ్యమైన ఆనకట్టలపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం అందింది. ఈ క్రమంలో కృష్ణసాగర డ్యాం భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టినిసారించింది. అందులో భాగంగా డ్యాం ముఖ్యమైన భాగాలతో పాటు కాలువలపై కూడా 360 డిగ్రీల కోణంలో తిరిగి ఇరవై నాలుగు గంటలూ పనిచేసే 60 సీసీ కెమరాలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ కెమరాల్లో ఉన్న అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానం వల్ల రాత్రివేళలో కూడా డ్యాం చుట్టపక్కల ఉన్న మనిషిని స్పష్టంగా వీడియో తీయడానికి వీలవుతుంది. అంతేకాకుండా సీసీ కెమరాల ఫుటేజీలను కనీసం మూడేళ్లపాటు భద్రపరిచే ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరులో ఓ రహస్య ప్రాంతంలోని భూ గృహంలో డాటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఆనకట్ట ఉత్తర దక్షిణ ప్రాంతాల్లోని ప్రవేశ ద్వారాల వద్ద అత్యాధునిక ‘బూమ్ బ్యారియర’్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి భద్రతా సిబ్బంది ‘కనుపాప’ల ఆధారంగా పనిచేస్తాయి. అంతేకాకుండా వీటి తయారీలో వాడే ప్రత్యేక లోహాల వల్ల గంటకు సుమారు వందకిలోమీటర్ల వేగంతో వ చ్చి ఢీ కొట్టినా విరిగిపోవు. దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఉత్తమ రక్షణ దళాలుగా పేరొందిన ‘నేషనల్ సెక్యూరిటీ గార్’్డ (ఎన్‌ఎస్‌జీ)తో ఇక్కడి భద్రతా సిబ్బందికి కఠిన శిక్షణ ఇప్పించనున్నారు.
 
ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వ హించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటుకు సుమారు రూ.5 కోట్లు ఖర్చవుతుందని, మానవ వనరుల శిక్షణ కోసం మరో అరకోటిదాకా వెచ్చించాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈమేరకు రూపొందించిన నివేదికను కేంద్రప్రభుత్వ అనుమతి కోసం పంపినట్లు విధానసౌధ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం కూడా ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement