ఎమ్మెల్యే ప్రసంగిస్తున్న వేదికపై అగ్నిప్రమాదం | fire accident in trs party program | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ప్రసంగిస్తున్న వేదికపై అగ్నిప్రమాదం

Apr 15 2017 1:20 PM | Updated on Sep 5 2018 9:47 PM

పెద్దపల్లి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది.

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్న కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. అత్యుత్సాహానికి వెళ్లిన కొందరు కార్యకర్తలు టపాసులు పేలుస్తుండగా.. ప్రమాదవశాత్తు టపాసులు ఎగిరిపడి సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్‌కు మంటలంటుకున్నాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో.. వేదికపై ఉన్న నాయకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీతారాణి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement