టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

Under 19 World Cup Final Match Bangladesh Win Toss Opt To Bowl - Sakshi

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌–19 ప్రపంచ కప్‌ తుది సమరానికి తెరలేచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ‘యువ’భారత్‌ తొలిసారి అండర్‌–19 ప్రపంచ కప్‌ ఫైనల్‌ చేరిన బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఆఖరి పోరులో టాస్‌ పడింది. బంగ్లా యువ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు టీమిండియా బరిలోకి దిగుతుండగా.. ఈ సువర్ణావకాశాన్ని వదులుకోరాదని బంగ్లాదేశ్‌ పట్టుదలగా ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.

ఆదివారం ఇక్కడ భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఐసీసీ సోమవారాన్ని ‘రిజర్వ్‌ డే’గా పెట్టింది. ఆ రోజూ మ్యాచ్‌ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇక టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన ఇరు జట్లూ.. బలాబలాలపరంగా చూస్తే దాదాపుగా సమ ఉజ్జీలుగా ఉన్నాయి. నాకౌట్‌ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లను భారత్‌ ఓడిస్తే... దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లను బంగ్లాదేశ్‌ చిత్తు చేసింది.
(చదవండి : 'ఫైనల్లో బంగ్లాదేశ్‌ను కుమ్మేయండి')

తుది జట్లు : 
ఇండియా అండర్‌-19 : యశస్వి జైస్వాల్, దివ్యాన్ష్‌ సక్సేనా, తిలక్ వర్మ, ప్రియం గార్గ్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), సిద్ధేష్ వీర్, అధర్వ అంకోలేకర్, రవి బిష్ణోయ్, శశ్వత్ రావత్, కార్తీక్ త్యాగి, ఆకాష్ సింగ్

బంగ్లాదేశ్ అండర్‌-19 : పర్వేజ్ హుస్సేన్, టాంజిద్ హసన్, మహ్మద్‌ఉల్ హసన్, తోహిద్ హ్రిదోయ్, షాహదత్ హుస్సేన్, అవిషేక్ దాస్, అక్బర్ అలీ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), షమీమ్ హుస్సేన్, రాకిబుల్ హసన్, షోరిఫుల్ ఇస్లాం, టాంజిమ్ హసన్ షకీబ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top