రాష్ట్ర త్రోబాల్‌ జట్టులో సమీనా, మాథ్యూ | Sameena, Mathew in Telangana Throw Ball Team | Sakshi
Sakshi News home page

రాష్ట్ర త్రోబాల్‌ జట్టులో సమీనా, మాథ్యూ

Mar 22 2019 10:15 AM | Updated on Mar 22 2019 10:15 AM

Sameena, Mathew in Telangana Throw Ball Team - Sakshi

హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. ఈ జట్టులో ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ జమ్మిగడ్డకు చెందిన షేక్‌ సమీనా యాస్మిన్‌ చోటు దక్కించుకుంది. హరియాణాలోని పానిపట్‌లో ఈనెల 23 నుంచి 25 వరకు జాతీయ జూనియర్‌ త్రోబాల్‌ చాంపియన్‌ షిప్‌ జరుగుతుంది. ఈ జట్లకు కోచ్‌గా అభిషేక్‌ సింగ్, మేనేజర్‌గా సరిత వ్యవహరించనున్నారు. రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులకు తెలంగాణ త్రోబాల్‌ సంఘం కార్యదర్శి సోమేశ్వర్, డీవైఎస్‌ఓ సుధాకర్‌ రావు స్పోర్ట్స్‌కిట్లను అందజేశారు.  

జట్ల వివరాలు
బాలికలు: వి. నిహారిక, కె. శ్రీవర్ష, ఎన్‌. అపూర్వ, సమీనా యాస్మిన్, సొనాలి పాత్రో, కార్తీక తోట, కె. వసుధ, మేఘన, వినీత, డి. అఖిల, కారుణ్య, లక్ష్మీ జాన్వి, బి. పూజిత, ఎన్‌. ఆశ్రిత.
బాలురు: మార్వెల్‌ పి. మాథ్యూ, నీరజ్‌ కుమార్, నవీన్‌ రాజ్, డి.శ్రీకాంత్, ఎం. తేజ సాయికృష్ణ, బి. అరుణ్‌ కుమార్, హెచ్‌. రంగ, సీహెచ్‌. మనోజ్, ఎం. శివసాయి, సాయికౌశిక్, రామకృష్ణ, జి. శ్రీనివాస్, బాలాజీ,  జీవన్, పరమేశ్‌. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement