
పుణే: ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సాకేత్ 4–6, 6–2, 6–0తో పెజ్దా క్రిస్టిన్ (సెర్బియా)పై గెలిచాడు.
ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రామ్‌కుమార్ రామనాథన్ 7–6 (9/7), 6–3తో బ్రైడన్ క్లియెన్ (బ్రిటన్)పై, యూకీ బాంబ్రీ 6–4, 7–6 (7/4)తో పావిచ్ (క్రొయేషియా)పై గెలిచారు.