ట్రాక్టర్‌ నడిపిన ధోని..!!

MS Dhoni Drives Tractor In Tamilnadu - Sakshi

చెన్నై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తమిళనాడులోని తిరునెల్వేలిలో సందడి చేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో భాగంగా జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ధోని ట్రాక్టర్‌ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఇక్కడ పర్యటించి అభిమానులను అలరించారు. మైదాన‌మంతా కలియ తిరిగిన ధోని అభిమానుల‌కు అభివాదం చేశాడు.

టీఎన్‌పీఎల్‌లో భాగంగా తిరునెల్వేలిలో మధురై పాంథర్స్, కోవై కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముందు నిర్వహించిన టాస్ సమయంలోనూ ధోనీ మైదానంలోనే ఉన్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అకస్మాత్తుగా స్డేడియంలో ప్రత్యక్షమవడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు.

ఈ సందర్భంగా కెప్టెన్ కూల్ మాట్లాడుతూ వచ్చే ఐపీఎల్ సీజన్‌లోగా తమిళం మాట్లాడటం నేర్చుకుంటానని ఫ్యాన్స్‌కు చెప్పారు. ప్రతి ఏడాది టీఎన్‌పీఎల్‌లో జరిగే కొన్ని మ్యాచ్‌లను వీక్షించేందుకు తప్పకుండా వస్తానని వివరించారు. ఈ ఏడాది టోర్నీలో నేను చూసిన తొలి గేమ్ ఇదేనని వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top