
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో మహిళలపై గంటకో అత్యాచారం జరుగుతోందని.., చంద్రబాబు నేతృత్వంలో నడుస్తున్నది అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వమనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. ఆమె బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు.
దివ్యాంగులను సైతం టీడీపీ నేతలు విడివకుండా కిరాతకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో మంగళవారం జరిగిన దారుణ ఘటన సీఎం దృష్టికి రాకపోవడం విచారకరమన్నారు. గుంటూరు జిల్లాలో ఒంటరి మహిళపై ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడని మండిపడ్డారు.