అగ్రతాంబూలం

Three Members Selected In AP Cabinet East Godavari - Sakshi

కొవ్వూరు: పచ్చని ‘పశ్చిమ’కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యమిస్తూ ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. సామాజికవర్గాల వారీగా సమతుల్యం పాటిం చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఏలూరు ఎమ్మెల్యే నానికి ఉప ముఖ్యమంత్రి ప దవితో పాటు ఆరోగ్య, కుటుంబసంక్షేమ, వైద్యవిద్య శాఖను కేటా యించారు. ఇలా ప్రధానమైన కాపు సామాజికవర్గానికి మంత్రివర్గంలో అగ్రతాంబూలం ఇచ్చారు. ఎస్సీ సామాజిక వ ర్గానికి చెందిన కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితకు మహిళ, శిశు సంక్షేమ శాఖను, డెల్టాలో కీలకమైన క్షత్రియ వర్గానికి చెందిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు. వీరు ముగ్గురు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. వీరిలో ఆళ్ల నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు ఒకసారి ఎమ్మెల్సీ గా పనిచేíసిన అనుభవం ఉంది. తానేటి వనిత, శ్రీరంగనాథరాజు రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
 
సేవా సే‘నాని’
ఆళ్ల నానికి జిల్లాలో వివాదరహితుడిగా గుర్తింపు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉండటంతో పాటు  క్లిష్ట సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్సార్‌తో కూడా అత్యంత సన్నిహి తంగా ఉండేవారు. వైఎస్సార్‌ కుటుంబంతో సుదీర్ఘకాలం నుంచి మంచి అనుబంధం ఉంది. ఏలూరు నుంచి గెలుపొందిన వారిలో ఇప్పటివరకూ ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు దక్కగా వీరిలో ఒక రు ఆళ్ల నాని కావడం విశే షం. గతంలో ఎన్టీఆర్‌ హ యాంలో మరడాని రంగరావు కొంతకాలం మంత్రిగా వ్యవహరించారు. మరలా మూడు దశాబ్దాల తర్వాత ఏలూరుకు మంత్రి పదవి ఇప్పుడు లభించింది.

టీడీపీ కోటలో విజేత.. వనిత
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1999లో మినహా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తూ వచ్చింది. మరలా 20 ఏళ్ల తర్వాత టీడీపీ కోటలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తానేటి వనిత పాగావేశారు. గత 30 ఏళ్లలో ఏ ఎమ్మెల్యేకి దక్కని మెజార్టీని ఆమె సొంతం చేసుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకూ ము గ్గురికి మంత్రి పదవులు దక్కాయి. 1978లో ఏఎం అజీజ్‌ అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన కేఎస్‌ జవహర్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు తానేటి వనితకి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మంత్రిగా స్థానం దక్కింది.

మంత్రులను ఓడించిన రా‘రాజు’
ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో అత్తిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి అప్పటి దేవదాయశాఖ మంత్రి దండు శివరామరాజును ఓడించారు. మరలా 2019 ఎన్నికల్లో ఆచంట నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పితా ని సత్యనారాయణకు ఓట మి రుచి చూపించారు. ఇ లా ఇద్దరు మంత్రులను ఓ డించిన అరుదైన ఘనతని శ్రీరంగనాథరాజు దక్కిం చుకున్నారు. ఆచంట నియోజకవర్గం నుంచి ఇ ప్పటివరకు ముగ్గురికి అ మాత్య పదవులు దక్కా యి. 1967లో దాసరి పెరుమాళ్లు (కాంగ్రెస్‌) సాం ఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. మూడు దశాబ్దాల తర్వాత పితాని మంత్రి గా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు శ్రీరంగనాథరాజుకు మంత్రి పదవి దక్కింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top