సంక్షేమానికి నిర్వచనం చెప్పిన వైఎస్సార్‌

Sajjala Ramakrishna Reddy Comments about YSR - Sakshi

జయంతి సభలో సజ్జల నివాళి 

వైఎస్సార్‌ సంక్షేమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న జగన్‌ 

సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమ పథకాలతో చరిత్రను మేలిమలుపు తిప్పిన రాజకీయ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనీ, నిజమైన పాలకుడు ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఆయన అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్‌ 71వ జయంతి సభలో తొలుత రామకృష్ణారెడ్డితో సహా పలువురు నేతలు ఆవరణలోని వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సజ్జల మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

► ఉమ్మడి రాష్ట్రంలో 8 కోట్ల మందికి భాగ్యవిధాతగా చరిత్రలో నిలిచిపోయారని, సంక్షేమానికి నిర్వచనం చెప్పిన వైఎస్సార్‌ మరణించి దశాబ్దమైనా ఇప్పటికీ తల్చుకుంటున్నామంటే కారణం అదేనని సజ్జల అన్నారు.  
► వైఎస్సార్‌ సంక్షేమ స్ఫూర్తితో సాగుతున్న వైఎస్‌ జగన్‌ పాలన గురించి ఎన్ని సార్లు చెప్పినా తనివి తీరదు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ పూర్తి చేయడమే కాక సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేశారన్నారు. 
► వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వాసిరెడ్డి పద్మ, ఎన్‌.లక్ష్మీ పార్వతి, చల్లా మధు, మేడపాటి వెంకట్, పండుగాయల రత్నాకర్, కొమ్మూరి కనకారావు, వడ్డెర మధుసూదనరావు, లేళ్ల అప్పిరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నారమల్లి పద్మజ, చిల్లపల్లి మోహన్‌రావు, బసిరెడ్డి సిద్ధారెడ్డి, నాగదేశి రవికుమార్, కర్నాటి ప్రభాకర్, వరప్రసాద్‌ రెడ్డి, ఈద రాజశేఖర్,  తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top