సాధ్విని మందలించిన జేపీ నడ్డా! | JP Nadda pulls up Sadhvi Pragya | Sakshi
Sakshi News home page

సాధ్విని మందలించిన జేపీ నడ్డా!

Jul 22 2019 4:45 PM | Updated on Jul 22 2019 5:09 PM

JP Nadda pulls up Sadhvi Pragya - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మరుగుదొడ్లు కడగడం కోసమో.. వీధులు ఊడ్చడం కోసమో తాను ఎంపీగా ఎన్నికవ్వలేదంటూ బీజేపీ భోపాల్‌ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మానస పథకంగా ‘స్వచ్ఛ భారత్‌’కు విశేషమైన ప్రాచుర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఆయన సొంత పార్టీ ఎంపీ ఈవిధంగా వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్‌ ఎంపీ సాధ్విపై కన్నెర్ర జేసింది. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సాధ్వి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ.. ఆమెను మందలించినట్టు తెలుస్తోంది. ఇకముందు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని ఆమెకు సూచించినట్టు సమాచారం. టాయిలెట్‌ వ్యాఖ్యల నేపథ్యంలో జేపీ నడ్డాతోపాటు బీజేపీ ఆర్గనైజషనల్‌ జనరల్‌ సెక్రటరీ బీఎల్‌ సంతోష్‌ ఆమెను పిలిపించుకొని.. ఈ వ్యాఖ్యల విషయమై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement