ఆ ఇద్దరూ డెంగ్యూ దోమల కన్నా డేంజర్‌!

DMK's mouthpiece cartoon on EPS, OPS - Sakshi

సాక్షి, చెన్నై: రాజకీయ అనిశ్చితి వెంటాడుతున్న తమిళనాడులో తాజాగా డీఎంకే అధికార పత్రిక 'మురసోలి' ప్రచురించిన ఓ కార్టూన్‌ వివాదం రేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌ సెల్వాన్ని రక్తంతాగే దోమలుగా చిత్రిస్తూ.. 'ప్రజల రక్తం తాగడంలో డెంగ్యూ దోమలు మించిపోయిన ఇద్దరు ద్రోహులు' అంటూ మురసోలీ ఈ కార్టూన్‌ ప్రచురించింది.

తమిళనాడులో ఇటీవల డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ప్రబలడంతో ఈ అంశంపై అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే ప్రరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రతిపక్ష డీఎంకే వ్యూహ్యాలు 'డెంగ్యూ' కన్న ప్రమాదకరమని ఇటీవల అన్నాడీఎంకే విమర్శించింది. ఈ విమర్శకు బదులుగా డీఎంకే వేసిన ఈ కార్టూన్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

డీఎంకే ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి లాంటిదని, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని అన్నాడీఎంకే మంత్రి సెల్లు రాజా విమర్శించారు. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్‌ విరుచుకుపడుతూ.. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ను 'డెంగ్యూ భాస్కర్‌'గా అభివర్ణించారు. ఈ మేరకు డీఎంకే పత్రిక కార్టూన్ కూడా వేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top