నిరసనలో నిరసన.. అదుపులోకి మరో యువతి!

Woman Holds Kashmir Free Placard Detained In Bengaluru - Sakshi

బెంగళూరు: ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేసిన అమూల్యకు వ్యతిరేకంగా హిందూ జాగరణ్‌ వేదిక శుక్రవారం నిరనస కార్యక్రమం చేపట్టింది. అయితే, అనూహ్యంగా ఓ యువతి ‘కశ్మీర్‌కు స్వేచ్ఛ కావాలి’, దళితులకు, ముస్లింలకు విముక్తి కావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జాగరణ్‌ వేదిక కార్యకర్తలు యువతిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. నిరసనకారులు ఆమెను చుట్టుముడుతున్నక్రమంలో అప్రమత్తమైన పోలీసులు భద్రత నడుమ ఆమెను అక్కడ నుంచి తరలించారు. యువతిని అదుపులోకి తీసుకున్నామని, ఆమె నేపథ్యం తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించామని బెంగుళూరు పోలీస్‌ కమిషనర్‌ భాస్కరరావు తెలిపారు.
(చదవండి : ‘పాక్‌ జిందాబాద్‌’ నినాదాలు.. 14 రోజుల కస్టడీ)

ఇక బెంగుళూరు ఫ్రీడంపార్క్‌లో గురువారం జరిగిన పౌరసత్వ సవరణ చట్టం నిరసన కార్యక్రమంలో అమూల్య లియోన్‌ అనే యువతి ‘‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’’ అంటూ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. అమూల్యను 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీకి తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సహా పలువురు ఈ ర్యాలీకి హాజరయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top