సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాన సంఘం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది.
సాక్షి, చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాన సంఘం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది. రజనీకాంత్ పుట్టినరోజైన 12వ తేదీన పార్టీ పేరు, జెండా, గుర్తులను ప్రకటించనున్నట్లు తిరుపూరుకు చెందిన తమిళనాడు రజనీకాంత్ ప్రజా కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎస్‌ఎస్ మురుగేష్ మంగళవారం ప్రకటించారు. పార్టీ స్థాపనపై కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు సైతం చేసుకున్నట్లు మురుగేష్ వెల్లడించారు.
కాగా, నిబంధనలకు విరుద్ధంగా మురుగేష్ వ్యవహరిస్తున్నారని, రజనీ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని అభిమాన సంఘాల నేత ఒకరు వ్యాఖ్యానించారు.