భారతీయ బాలుడిపై పాక్ సైన్యం ఔదార్యం | Pak army hands over Indian boy who crossed LoC inadvertently | Sakshi
Sakshi News home page

భారతీయ బాలుడిపై పాక్ సైన్యం ఔదార్యం

Nov 19 2014 9:51 AM | Updated on Mar 23 2019 8:28 PM

భారతీయ బాలుడిపై పాక్ సైన్యం ఔదార్యం - Sakshi

భారతీయ బాలుడిపై పాక్ సైన్యం ఔదార్యం

తమ భూభాగంలోకి ప్రవేశించిన భారతీయ టీనేజీ బాలుడిని పాక్ సైన్యం తిరిగి భారత సైన్యానికి అప్పగించింది.

ఇస్లామాబాద్: తమ భూభాగంలోకి ప్రవేశించిన భారతీయ టీనేజీ బాలుడిని పాక్ సైన్యం తిరిగి భారత సైన్యానికి అప్పగించింది. కాశ్మీర్లోని ఝానగర్కు చెందిన మంజర్ హుస్సేన్ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. అతడు నవంబర్ 14వ తేదీన అనుకోకుండా భారత్, పాక్ సరిహద్దుల్లోని అసల్ కాస్ నుల్లా వద్ద నియంత్రణ రేఖను దాటి పొరుగు దేశ భూభాగంలోకి ప్రవేశించాడు.

దాంతో హుస్సేన్ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని ఉన్నతాధికారులకు అప్పగించారు. దాంతో హుస్సేన్ను ఉన్నతాధికారులు విచారించి ... మంగళవారం చకొటి -యూరి కేంద్రం వద్ద భారత్ సైన్యానికి హుస్సేన్ను అప్పగించినట్లు పాక్ సైన్యం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement