అంచనాలు తగ్గించనున్న ఐఎండీ

A 'normal' monsoon with droughts and floods? - Sakshi

న్యూఢిల్లీ: ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలకు రుతుపవనాలపై తన అంచనాలను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా ఈ సీజన్‌ మొత్తానికి అంచనాలు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్‌ వాతావరణ సంస్థ స్కైమెట్‌ ఇప్పటికే అంచనాలను కుదించిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక సగటు(ఎల్‌పీఏ)ని 92 శాతంగా సవరించింది. ఎల్‌పీఏ 96–104 శాతం మధ్య ఉంటే, ఆ పరిస్థితిని సాధారణ వర్షపాతంగా భావిస్తారు. ఈ సీజన్‌లో 100 శాతం ఎల్‌పీఏతో వర్షాలు పడతాయని ఏప్రిల్‌లో ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top