సరిహద్దులను మూసేయండి

India COVID-19 death toll rises to 27 as total cases reach 1024 - Sakshi

రాష్ట్రాలు, జిల్లాల బోర్డర్లను మూసేయాలని కేంద్రం ఆదేశాలు

వలస కూలీల ప్రయాణాలతో కరోనా వ్యాప్తి ముప్పు

1,024కి చేరిన కేసులు కొత్తగా 8 వైరస్‌ మరణాలు

పత్రికల సరఫరాకు అంతరాయం కలిగించొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు

న్యూఢిల్లీ:  వలస కూలీల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి జరగకుండా అడ్డుకోవడం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులను మూసేయాలని కేంద్రం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి సరిహద్దులను దాటేందుకు ప్రయత్నించిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. అయితే, కేంద్రం కఠినమైన ఆదేశాలను జారీ చేసినప్పటికీ.. వేల సంఖ్యలో ఉపాధి కరువైన వలస కూలీలు మూకుమ్మడిగా నగరాల నుంచి తమ స్వస్థలాలకు కాలినడక సహా తమకు వీలైన అన్ని మార్గాల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసుల సంఖ్య ఆదివారం సాయంత్రానికి 1,024 అని, మరణాల సంఖ్య 27 అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

గత 24 గంటల్లో భారత్‌లో 8 మరణాలు, చోటు చేసుకున్నాయని ప్రకటించింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 6, గుజరాత్‌లో 5, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్‌లో 2, ఢిల్లీలో 2, జమ్మూకశ్మీర్లో 2, తెలంగాణ, కేరళ, తమిళనాడు, బిహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాలు చోటు చేసుకున్నాయి. కాగా, ఆదివారం కొత్తగా నమోదైన కేసుల్లో స్పైస్‌జెట్‌ పైలట్‌ ఒకరు కూడా ఉన్నారు. అయితే, ఆయనకు మార్చి నెలలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన చరిత్ర లేకపోవడం గమనార్హం. లాక్‌డౌన్‌ కారణంగా, ఇళ్లకే పరిమితమై పలువురు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. నిమ్‌హ్యాన్స్‌ 08046110007 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసిందన్నారు.

వలస కూలీల విషాదం: కరోనా సమస్య దేశంలో మరో సంక్షోభానికి కారణమైంది. వైరస్‌ వ్యాప్తి ప్రమాదమున్నప్పటికీ.. దేశవ్యాప్తంగా వేలాదిగా వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఆంక్షల నడుమనే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, ఢిల్లీ– యూపీ సరిహద్దులు, కేరళ, మహారాష్ట్రల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కూలి ఢిల్లీ నుంచి స్వస్థలానికి వెళ్లేందుకు 200 కిమీలు నడిచి, ఉత్తరప్రదేశ్‌లో గుండెపోటుతో మరణించిన విషాదం ఆదివారం చోటు చేసుకుంది. ‘ఏదో వైరస్‌ అందరినీ చంపేస్తుందని అంటున్నారు. నాకవేమీ తెలియదు. ఇక్కడ ఉంటే నా పిల్లలకు అన్నం పెట్టలేకపోతున్నా.

ఆ వైరస్‌తో చావడం కన్నా ముందు ఆకలితో చనిపోయేలా ఉన్నాం’ అని ఢిల్లీలో కూలి పనులు చేసుకునే సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది. మథుర హైవే మీదుగా 400 కిమీల దూరంలో యూపీలో ఉన్న తమ స్వగ్రామానికి కాలి నడకనైనా సరే వెళ్లేందుకు ఆమె తన పిల్లలతో కలిసి పయనమైంది. ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లో వేలాదిగా కూలీలు, ఇతర సామాన్యులు తమ ఊర్లకు వెళ్లేందుకు హైవేపై నిలిచి ఉన్నారు. ఈ సామూహిక ప్రయాణాలతో వైరస్‌ మరింత ప్రబలే ప్రమాదముందని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల్లో లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం ప్రయాణికుల రాకపోకలను నిలిపేయాలని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల డీజీపీలు, చీఫ్‌ సెక్రటరీలను ఆదేశించారు.

అయితే, అత్యవసర, అత్యవసరం కాని వస్తువులనే భేదం చూపకుండా సరుకులు సరఫరా చేసే అన్ని వాహనాలను అనుమతించాలని అజయ్‌ భల్లా స్పష్టం చేశారు. దిన పత్రికల సరఫరాకు కూడా అంతరాయం కలిగించకూడదన్నారు.  సామాన్యులు, దినసరి కూలీల నుంచి ఇంటి అద్దె డిమాండ్‌ చేయవద్దని యజమానులను ఒక ప్రకటనలో ప్రభుత్వం కోరింది. సామాన్యులు, విద్యార్థులు, ఇతర కూలీలను అద్దె ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే..  వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల కూలీలకు భోజన, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

ప్రధాని సమీక్ష
కరోనాపై పోరు కోసం తీసుకున్న చర్యల గురించి ప్రధాని మోదీ స్వయంగా సమీక్షిస్తున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఆరోగ్య మంత్రులు, వైద్య నిపుణులు సహా ప్రతీ రోజు దాదాపు 200 మంది నుంచి ఆయన వివరాలు తెలుసుకుంటున్నారు.

అంబులెన్స్‌ సిబ్బందికి ప్రామాణిక మార్గదర్శకాలు
కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించే విషయంలో అంబులెన్స్‌ సిబ్బందికి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రామాణిక మార్గదర్శకాలు జారీ చేసింది. అంబులెన్స్‌ డ్రైవర్లకు, సాంకేతిక ఇబ్బందికి ఇవి వర్తిస్తాయి. బాధితులను ఆసుపత్రులకు తరలిస్తుండగా వీరు సైతం కరోనా బారినపడుతున్నట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. అంబులెన్స్‌ల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వీటిలో పని చేసే వారంతా తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు ఆధునిక రక్షణ పరికరాలు ఉపయోగించాలని స్పష్టం చేసింది.

అంబులెన్స్‌లోని రోగికి, అతడి సహాయకుడికి మూడు పొరల మాస్కులు, గ్లోవ్స్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.  కోవిడ్‌–19 కేసులను ఎలా గుర్తించాలన్న దానిపై ఒక నమూనా ప్రశ్నావళిని ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఎక్కడికక్కడ ప్రైవేట్‌ అంబులెన్స్‌ల జాబితా రూపొందించాలని, వాటిని కేంద్రీకృత కాల్‌ సెంటర్‌తో అనుసంధానించాలని, తద్వారా అంబులెన్స్‌ అందుబాటు సమయాన్ని గరిష్టంగా 20 నిమిషాలకు తగ్గించాలని పేర్కొంది. గుర్తింపు పొందిన అంబులెన్స్‌లనే కరోనా బాధితుల రవాణాకు ఉపయోగించాలని తేల్చి చెప్పింది.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

01-06-2020
Jun 01, 2020, 05:14 IST
ముంబై: గతవారాంతాన వెల్లడైన పదకొండేళ్ల కనిష్టస్థాయి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, ద్రవ్య లోటు తీవ్రత వంటి ఆర్థికాంశాలతో...
01-06-2020
Jun 01, 2020, 04:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి 51 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ...
01-06-2020
Jun 01, 2020, 04:27 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జీ–7 కూటమిని విస్తరించాలని ప్రతిపాదించారు. భారత్‌ సహా మరో మూడు దేశాలను చేర్చి...
01-06-2020
Jun 01, 2020, 04:06 IST
న్యూఢిల్లీ: కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని దేశ ప్రజలను ప్రధాని మోదీ హెచ్చరించారు. అన్ని జాగ్రత్తలతో మరింత అప్రమత్తతతో ఉండాలని...
01-06-2020
Jun 01, 2020, 02:13 IST
సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ఆదివారం అటు దేశవ్యాప్తంగా, ఇటు తెలంగాణలోనూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌...
01-06-2020
Jun 01, 2020, 01:50 IST
సాక్షి, హైదరాబాద్‌ : కంటైన్మెంట్‌ జోన్లు మినహా రాష్ట్రంలో జూన్‌ 7 వరకు లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కంటైన్మెంట్‌ జోన్లలో...
01-06-2020
Jun 01, 2020, 01:17 IST
వలస కార్మికుల కోసం ఎవరికి వీలైన సహాయం వాళ్లు చేస్తున్నారు. వాళ్లను సొంత ఊళ్లకు పంపుతూ కొందరు, వాళ్లకు కావాల్సిన...
01-06-2020
Jun 01, 2020, 00:53 IST
మహేశ్‌బాబు ఫేవరెట్‌ కలర్‌ ఏంటి? ఆయనకు వంటొచ్చా? ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారు? మహేశ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు? మహేశ్‌కి...
31-05-2020
May 31, 2020, 21:49 IST
రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
31-05-2020
May 31, 2020, 21:30 IST
చనిపోయిన కోవిడ్‌ బాధితుడు బతికే ఉన్నాడని చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. మరోసారి అతను చనిపోయినట్టు చెప్పి పరువు తీసుకుంది.
31-05-2020
May 31, 2020, 19:33 IST
ప్రస్తుతం డింకో సింగ్‌ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
31-05-2020
May 31, 2020, 18:07 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మొదటితో పోలిస్తే రోజులు గడుస్తున్నా కొద్ది వైరస్‌ వ్యాప్తి...
31-05-2020
May 31, 2020, 16:39 IST
సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదోవిడత లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనూ...
31-05-2020
May 31, 2020, 16:29 IST
ఈ క్లిష్ట సమయంలో ఢిల్లీ ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా
31-05-2020
May 31, 2020, 15:16 IST
సాక్షి, ముంబై : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిపై శివసేన తీవ్ర ఆరోపణలు చేసింది. దేశంలో కరోనా విజృంభణకు గుజరాత్‌లో నిర్వహించిన ‘నమస్తే...
31-05-2020
May 31, 2020, 14:20 IST
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్‌తో పోరాడి...
31-05-2020
May 31, 2020, 13:33 IST
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య...
31-05-2020
May 31, 2020, 13:24 IST
డెహ్రాడున్: క‌రోనా వైర‌స్‌కు త‌న ‌త‌మ తార‌త‌మ్య బేధాలు లేవు. సామాన్యుడి నుంచి పాల‌కుల వ‌ర‌కూ ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌కుండా అంద‌రినీ...
31-05-2020
May 31, 2020, 12:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో జనవరి 22 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు 40,184 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి....
31-05-2020
May 31, 2020, 12:05 IST
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు పాతబస్తీ, మలక్‌పేట్, వనస్థలిపురం, జియాగూడ, కుల్సుంపురలకే పరిమితమైన కరోనా వైరస్‌ తాజాగా కొత్త కాలనీల్లోనూ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top