బాలికపై మతాచార్యుడి అత్యాచారం | 16-year-old girl tortured, raped by clergyman; arrested | Sakshi
Sakshi News home page

బాలికపై మతాచార్యుడి అత్యాచారం

Feb 4 2015 10:36 PM | Updated on Sep 2 2017 8:47 PM

పశ్చిమబెంగాల్లో చిన్సురాలోని ఓ బాలికల పునరావాస కేంద్రంలో దారుణం జరిగింది.

చిన్సురా: పశ్చిమబెంగాల్లో చిన్సురాలోని ఓ బాలికల పునరావాస కేంద్రంలో దారుణం జరిగింది. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న ఓ మైనర్ బాలికపై మతాచార్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాదిగా పునరావాస కేంద్రంలో ఉంటున్న ఆ అమ్మాయిని గత నెల రోజుల నుంచి చిత్రహింసలు పెడుతూ, లైంగిక దాడి చేశాడు. ఓ ఎన్జీవో ఫిర్యాదు మేరకు పోలీసులు మతాచార్యుడిపై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. బాధితురాలిని ఇదే జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో నడిచే బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు.

Advertisement
Advertisement