ఎల్‌వోసీ వద్ద కాల్పులు; 8 మంది ఉగ్రవాదుల హతం | 15 Pak Soldiers And 8 Terrorists Killed In Army Action Near LOC | Sakshi
Sakshi News home page

ఎల్‌వోసీ వద్ద కాల్పులు; 8 మంది ఉగ్రవాదుల హతం

Apr 12 2020 5:47 PM | Updated on Apr 12 2020 5:51 PM

15 Pak Soldiers And 8 Terrorists Killed In Army Action Near LOC - Sakshi

కశ్మీర్‌ : జమ్మూ కశ్మీర్‌లోని కీరన్‌ సెక్టార్‌ పరిధిలో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసి)కు ఎదురుగా ఉన్న దూద్‌నైల్లో ఇండియన్‌ ఆర్మీ పాక్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టుంది. ‌దూద్‌నైల్‌లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్ల వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులతో పాటు 15 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.  అయితే ఈ కాల్పులు ఏప్రిల్‌10 వ తేదిన జరిగినట్లు వెల్లడించారు. కిషన్‌గంగా నది ఒడ్డున పాక్‌ ఉగ్రవాదులు కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దూద్‌నైల్‌పై దాడులు జరిపి ప్రతీకార చర్యలు తీసుకోవాలని భావించింది. అయితే అప్పటికే సమాచారం అందుకున్న భారత మిలటరీ విభాగం కీరన్‌ సెక్టార్‌కు చేరుకుని ముందుగా 8 మంది ఉగ్రవాదులను కాల్చి చంపారు. మరణించిన వారిలో ముగ్గురు జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారు కాగా మిగతా వారు జైష్-ఇ-మొహమ్మద్‌ నుంచి శిక్షణ పొందిన వారిగా గుర్తించారు. అయితే ఏప్రిల్ 10న కీరన్ సెక్టార్లో జరిగిన దాడిలో ఉగ్రవాదులతో పాటు 15 మంది పాకిస్తాన్ ఆర్మీ ట్రూపర్లతో కూడా మరణించినట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement