షారూక్ ని చెంప దెబ్బకొట్టిందట!

షారూక్ ని చెంప దెబ్బకొట్టిందట!


ముంబై:  బాలీవుడ్ సూపర్ స్టార్  షారూక్ ఖాన్ ను ముంబైలో ఓ మహిళ లాగి  లెంపకాయ  కొట్టిందట. ముంబైకి మొదటిసారి వచ్చినపుడు  రైల్లో  తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని  స్వయంగా ఆయనే అభిమానులతో పంచుకున్నారు. అవగాహన లేక రైల్లో తాను చేసిన పనికి ఆ మహిళ తన చెంపపై చాలా గట్టిగానే కొట్టిందని పేర్కొన్నారు. అప్ కమింగ్ మూవీ 'ఫ్యాన్' ట్రయిలర్ రిలీజ్ చేసిన  సందర్భంగా  అభిమానులతో షారూక్ ముచ్చటించారు. ఈ సందర్భంగా మిమ్మల్ని  మహిళ  కొట్టిందటగా  అని ఓ ఫ్యాన్ అడిగినపుడు అవునని అంగీకరించారు.  ఆనాటి సంఘటనను వారితో  షేర్ చేసుకున్నారు.రైల్లో ప్రయాణిస్తున్నపుడు   తాను  రిజర్వ్ చేసుకున్న బెర్త్ పై  మగాళ్లను ఎవర్నీ కూర్చోనివ్వలేదట ఈ డింపుల్ హీరో షారూక్.  ఇది  నా సీటు.. నేను రిజర్వ్ చేసుకున్నానంటూ వారితో వాగ్వాదానికి దిగారట. ఇంతలో బోగీలోకి వచ్చిన ఓ మహిళనుద్దేశించి...మీరు కూర్చోవచ్చుగానీ.. మగాళ్లు కూర్చోవడానికి వీల్లేదంటూ ఆమెకు సీట్  ఆఫర్ చేశారట.  


దీంతో  ఆగ్రహానికి గురైన ఆమె 'ఇది  నీది కాదు.. అందరిదీ'..అంటూ  షారూక్ ని లాగి చెంపపై కొట్టిందట.  తాను ఎక్కిన రైలు ముంబై నగరంలోకి అడుగుపెట్టిన తరువాత  లోకల్ ట్రైన్ గా మారుతుందనే విషయంలో అప్పట్లో తనకు తెలియదంటూ మొదటిసారి ముంబైకి  వచ్చినప్పటి అనుభవాలను ఆయన  గుర్తు చేసుకున్నారు. కాగా టీవీ నటుడుగా కెరియర్ మొదలు పెట్టిన షారూక్  అంచెలంచెలుగా ఎదిగి బాలీవుడ్ బాద్షాగా  అవతరించిన సంగతి తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top