ఆరు నుంచి ఆరు వరకు ఏం జరిగింది? | What Happen 6 to 6 Movie Audio Launched | Sakshi
Sakshi News home page

ఆరు నుంచి ఆరు వరకు ఏం జరిగింది?

Mar 6 2014 10:56 PM | Updated on Jul 12 2019 4:40 PM

ఆరు నుంచి ఆరు వరకు ఏం జరిగింది? - Sakshi

ఆరు నుంచి ఆరు వరకు ఏం జరిగింది?

‘చిన్న సినిమా అని చిన్న చూపు చూస్తున్నారు. సినిమా నిర్మాణానికే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. విడుదల చేయడానికి ఇంకా కష్టపడాల్సి వస్తోంది.

 ‘చిన్న సినిమా అని చిన్న చూపు చూస్తున్నారు. సినిమా నిర్మాణానికే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. విడుదల చేయడానికి ఇంకా కష్టపడాల్సి వస్తోంది. మంచి కథాంశంతో తీసిన సినిమా. నన్ను హీరోయిన్‌గా చూడాలని మా అంకుల్ గోయల్ కల. నాతో ఓ సినిమా నిర్మించాలనుకుని, రేపు ప్రారంభం అనగా చనిపోయారు. ఆయన కల నెరవేరాలనే ఆకాంక్షతో నేను హీరోయిన్‌గా నటించి, నిర్మించా’’ అన్నారు లక్ష్మి. వెంకీ, లక్ష్మీ జంటగా జనార్ధనరావు చల్లా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాట్ హ్యాపెన్ 6 టు 6’. ఎలెందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించి, మనోజ్ నందంకి ఇచ్చారు. ఈ వేడుకలో కేవీవీ సత్యనారాయణ, ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ తదితర సినీ ప్రముఖులతో పాటు రాజకీయవేత్తలు రామ్మోహన్ గౌడ్, సింగయ్యపల్లి గోపి, ఇందిరా రెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. అండమాన్-నికోబార్‌లో పలు ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ సినిమా తీశామని వెంకీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement