వేలై ఇల్లా పట్టాదారి-2కు సన్నాహాలు | Preparations to velai illa pattadari -2 | Sakshi
Sakshi News home page

వేలై ఇల్లా పట్టాదారి-2కు సన్నాహాలు

Nov 10 2016 3:30 AM | Updated on Sep 4 2017 7:39 PM

వేలై ఇల్లా పట్టాదారి-2కు సన్నాహాలు

వేలై ఇల్లా పట్టాదారి-2కు సన్నాహాలు

వేలై ఇల్లా పట్టాదారి చిత్రం 2014లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

వేలై ఇల్లా పట్టాదారి చిత్రం 2014లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నటుడు ధనుష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఆ చిత్రానికి వేల్‌రాజ్ దర్శకుడు. ఇటీవల త్వరలో ఒక ఫ్లాష్ న్యూస్‌ను వెల్లడించనున్నానని పేర్కొన్నారు. దీంతో అది ఏమై ఉంటుందనే ఆసక్తి పరిశ్రమ వర్గాల్లో సర్వత్రా నెలకొంది. ధనుష్ ఒక ఆంగ్ల చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.అదే విధంగా ఆయన పవర్‌పాండి పేరుతో ఒక చిత్రాన్ని డెరైక్ట్ చేస్తున్న విషయం విధితమే. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాన్ని నిర్మించనున్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలి సిందే. వీటిలో ఏదో ఒక విషయం గురించి ధనుష్ వెల్లడించే అవకాశం ఉంటుందని చాలా మంది ఊహించారు.

అయితే ధనుష్ చెప్పినట్లు గానే బుధవారం ఒక ప్రకటనను తన ట్విట్టర్‌లో వెల్లడించారు. అందులో ఆయన పేర్కొంటూ వెలై ఇల్లా పట్టాదారి 2 చిత్రంలో నటించనున్నట్లు పేర్కొన్నారు. ఆ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను, ధనుష్ వండర్‌బార్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి రజనీకాంత్ రెండవ కూతురు
సౌందర్యరజనీకాంత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఇంతకు ముందు నిలావుక్కు ఎన్నడీ ఎన్‌మేల్ కోపం అన్న టైటిల్‌ను అనుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వేలై ఇల్లా పట్టాదారి 2 చిత్ర షూటింగ్‌ను ఈ ఏడాది చివరిలో ప్రారంభించి వచ్చే ఏడాది చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement