సైంటిస్ట్‌ కరీనా

Michelle Yeoh boards James Cameron's Avatar sequels - Sakshi

పండోరా గ్రహంలోకి సైంటిస్ట్‌ కరీనా మోగ్‌గా వెళ్తున్నారు మలేషియన్‌ యాక్ట్రెస్‌ మిచెల్‌ వోహ్‌. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘అవతార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనమైన రికార్డ్స్‌ని క్రియేట్‌ చేసింది. అందుకే అవతార్‌ సీక్వెల్స్‌ (ప్రస్తుతానికి ‘అవతార్‌ 2’ నుంచి ‘అవతార్‌ 5’)ను రెడీ చేసే పనిలో ఉన్నారు కామెరూన్‌. నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఆస్ట్రేలియన్‌ యాక్టర్‌ బ్రాడెన్‌ కోవెల్‌ని ఇటీవలే ‘అవతార్‌’ ఫ్యామిలీలోకి ఆహ్వానించిన కామెరూన్‌ తాజాగా మలేషియన్‌ నటి మిచెల్‌ వోహ్‌కు స్వాగతం పలికారు.

‘‘అవతార్‌ సీక్వెల్స్‌లో సైంటిస్ట్‌ కరీనా మోగి పాత్రలో మలేషియన్‌ నటి మిచెల్‌ వోహ్‌ నటిస్తారు. విభిన్నమైన అద్భుతమైన పాత్రలతో పాటు ఎన్నో గుర్తుండిపోయే సినిమాల్లో ఆమె భాగస్వామ్యం అయ్యారు. మిచెల్‌తో కలిసి వర్క్‌ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని జేమ్స్‌ కామెరూన్‌ పేర్కొన్నారు. 1977 జేమ్స్‌ బాండ్‌ ఫిల్మ్‌ ‘టుమారో నెవర్‌ డైస్‌’లో నటించారు మిచెల్‌. కానీ ఎక్కువగా ఆమె హాంకాంగ్‌ యాక్షన్‌ బేస్డ్‌ సినిమాలు చేశారు. ‘యస్, మేడమ్‌ (1985), పోలీస్‌ స్టోరీ 3 (1992), సూపర్‌కాప్‌ (1992) హోలి వెపన్‌ (19 93)’ చిత్రాలు మిచెల్‌ నటించిన హాంకాంగ్‌ యాక్షన్‌ ఫిల్మ్స్‌లో కొన్ని. ఇక ‘అవతార్‌ 2, అవతార్‌ 3’ల చిత్రీకరణ ఒకేసారి జరుగుతుందని తెలిసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top