రూటు మార్చాలనుకుంటున్న మధుబాల | Madhu bala wants to act in Negative characters | Sakshi
Sakshi News home page

రూటు మార్చాలనుకుంటున్న మధుబాల

Aug 30 2013 1:13 AM | Updated on Sep 1 2017 10:14 PM

రూటు మార్చాలనుకుంటున్న మధుబాల

రూటు మార్చాలనుకుంటున్న మధుబాల

‘రోజా’ ఫేం మధుబాల దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘అంతకు ముందు ఆ తర్వాత’. కథానాయికగా సున్నితమైన పాత్రలు చేసి మెప్పించిన మధుబాలకు, కేరక్టర్ నటిగా కూడా అలాంటి పాత్రలే వస్తున్నాయి.

 అందుకే ఇప్పుడు రూటు మార్చాలనుకుంటున్నారామె. ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు చేయాలనే కోరిక ఉందని మధుబాల అంటున్నారు. ముఖ్యంగా అసూయతో రగిలిపోయి, భర్తను చంపే భార్య పాత్ర చేయాలని ఉందని పేర్కొన్నారామె.
 
 ప్రతి మనిషిలోనూ మంచి, చెడు రెండు లక్షణాలుంటాయని... మంచి లక్షణాలున్న పాత్రలు చేశాను కాబట్టి... ఇప్పుడు చెడుని కూడా ఆవిష్కరించాలనుకుంటున్నానని తెలిపారు మధుబాల.
 
Advertisement
 
Advertisement
Advertisement