పిల్లల్ని సముదాయించడం కోసం.. | karishma Kapoor Web Series Mentalhood | Sakshi
Sakshi News home page

'మెంటల్‌'హుడ్‌

Feb 27 2020 10:50 AM | Updated on Feb 27 2020 10:50 AM

karishma Kapoor Web Series Mentalhood - Sakshi

మార్చి 11 నుంచి ఆల్ట్‌–బాలాజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో కరిష్మా కపూర్‌ నటిస్తున్న ‘మెంటల్‌హుడ్‌’ వెబ్‌ సిరీస్‌ మొదలవుతున్నాయి. మదర్‌హుడ్‌ (మాతృత్వం) కి దగ్గరగా ఉన్న ఈ మెంటల్‌హుడ్‌ అనే మాటలో.. పిల్లలు తల్లికి ఎంతగా పిచ్చిపట్టిస్తారో చెప్పే అర్థం గుంభనంగా ఉంది. ఈ సిరీస్‌ కథాంశం కూడా అదే. పిల్లల్ని సముదాయించడం కోసం తల్లి నిత్యం వేసే ఆసనాలను ఏక్తాకపూర్‌ చూపించబోతున్నారు. ‘‘నాకు వచ్చిన అవార్డులన్నీ ఒక ఎత్తు, నా పిల్లలు ఒక ఎత్తు. నా కెరీర్‌ మొత్తం ఒకటి, వీళ్లిద్దరూ ఒకటి’’ అని మెంటల్‌హుడ్‌ ట్రైలర్‌ విడుదల సందర్భంగా కూతురు సమీరను, కొడుకు కయాలను చూపిస్తూ కరిష్మా అన్నారు. కరిష్మకు 2003లో సంజయ్‌ కపూర్‌ అనే బిజినెస్‌మేన్‌తో పెళ్లయింది. 2016లో ఆయనతో విడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement