పండోరా గ్రహంలోకి... | James Cameron 'Avatar Sequels Casts Jemaine Clement | Sakshi
Sakshi News home page

పండోరా గ్రహంలోకి...

May 20 2019 5:57 AM | Updated on May 20 2019 5:57 AM

James Cameron 'Avatar Sequels Casts Jemaine Clement - Sakshi

జెమైనే క్లేమిట్‌

మొన్న ఆస్ట్రేలియన్‌ నటుడు బ్రెండన్‌ కోవెల్, నిన్న మలేషియన్‌ నటి మిచెల్లి వోహ్‌... తాజాగా న్యూజిలాండ్‌ నటుడు  జైమైనే క్లేమిట్‌ ‘అవతార్‌’ ఫ్యామిలీలో జాయిన్‌ అయ్యారు. 2009లో ‘అవతార్‌’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించారు దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌. సినీ ప్రేమికులకు అంతగా నచ్చిన ఈ సినిమాకు సీక్వెల్స్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారాయన. ఈ ప్రక్రియలో ‘అవతార్‌’ కుటుంబం పెద్దది అవుతోంది. జెమైనే క్లేమిట్‌ అవతార్‌ ఫ్యామిలీలో చేరిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు జేమ్స్‌ కామెరూన్‌. ‘‘పండోర ప్రపంచంలో సముద్ర జీవ శాస్త్రవేత్త డాక్టర్‌ గార్విన్‌ పాత్రను జెమైనే క్లేమిట్‌ చేయబోతున్నారు. ‘అవతార్‌’ సీక్వెల్స్‌ కోసం ఆయన్ను తీసుకున్నాం’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఇక క్లేమిట్‌ విషయానికి వస్తే.. ‘జెంటిల్‌మెన్‌ బ్రోన్కోస్‌’ (2009), ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌ 3’ (2012) చిత్రాల్లో నటించారు. అంతేకాదు ‘వాట్‌ వుయ్‌ డు ఆన్‌ ది షాడోస్‌’ (2014) అనే హారర్‌ కామెడీ ఫిల్మ్‌తో దర్శకునిగా కూడా మారారు. ప్రస్తుతం ‘లెజియన్‌’ అనే అమెరికన్‌ టీవీ సీరిస్‌తో ఆయన బిజీగా ఉన్నారు.  ‘అవతార్‌ 2’  డిసెంబర్‌ 17, 2021న రిలీజ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement