కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌ | Dulquer Salmaan's look as Gemini Ganesan in the Savitri | Sakshi
Sakshi News home page

కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌

Jul 29 2017 12:50 AM | Updated on Sep 5 2017 5:05 PM

కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌

కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌

‘కాదల్‌ మన్నన్‌’.. అంటే ‘కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌’ అని అర్థం.

‘కాదల్‌ మన్నన్‌’.. అంటే ‘కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌’ అని అర్థం. తమిళ నటుడు జెమినీ గణేశన్‌ టైటిల్‌ ఇది. ఆయన తర్వాత అక్కడ ఈ బిరుదుని ఎవరూ సొంతం చేసుకోలేదు. అయితే మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో స్వప్నా దత్‌ నిర్మిస్తున్న ‘మహానటి’లో జెమినీ గణేశన్‌ పాత్రను దుల్కర్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. శుక్రవారం దుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్‌ని విడుదల చేశారు. ఈ లుక్‌ చూసినవాళ్లు కాదల్‌ మన్నన్‌లానే ఉన్నాడని అంటున్నారు. సావిత్రిగా కీర్తీ సురేశ్‌ నటిస్తోన్న ఈ చిత్రంలో సమంత కీలక పాత్ర చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement