ఐదు లక్షలు విరాళం

Director VV Vinayak donates Rs 5 lakh to movie artists - Sakshi

కరోనా వైరస్‌ ప్రభావంతో షూటింగ్స్‌ నిలిచిపోయాయి. దీంతో రోజువారీ వేతనంతో బతికే పేద కళాకారులు, సాంకేతిక నిపుణులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ ఐదు లక్షలు విరాళం అందించారు. నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘మనం సైతం’ ఫౌండేషన్‌కు ఆయన ఈ నగదును అందజేశారు.

ఈ సందర్భంగా వీవీ వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘ఈరోజు అందర్నీ వణికిస్తోన్న కరోనా వైరస్‌ను మనం ఇళ్లల్లో ఉండి వణికించాలి. షూటింగ్స్‌ లేకపోవడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు నిత్యావసర వస్తువులను అందజేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 లక్షల చెక్కును కాదంబరి కిరణ్‌కి అందజేశా. అవసరమైనవారు కిరణ్‌ని సంప్రదించి నిత్యావసర వస్తువులను తీసుకోవాలి’’ అన్నారు.  నిర్మాత రామసత్యనారాయణ, వల్లభనేని అనిల్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top