కాంగోలో 40 లక్షల మంది అనాథ బాలలు | Sakshi
Sakshi News home page

కాంగోలో 40 లక్షల మంది అనాథ బాలలు

Published Tue, Nov 29 2016 7:53 PM

కాంగోలో 40 లక్షల మంది అనాథ బాలలు

గోమా: ఆఫ్రికా ఖండ దేశమైన కాంగోలో 20 ఏళ్లుగా చెలరేగుతున్న హింసకు 40 లక్షలకు పైగా చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి దుర్భర జీవితం గడుపుతున్నారు. పశ్చిమ, మధ్య ఆఫ్రికా ప్రాంతాల్లో దాదాపు 260 లక్షల మందికి పైబడి అనాథలున్నారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో తెలిపింది.

జాతి కలహాలు, విలువైన ఖనిజాల కోసం వేట తదితర కారణాలతో చెలరేగుతున్న హింసకు అక్కడ అనేక కుటుంబాలు విచ్ఛినమవుతున్నాయని పేర్కొంది. లైంగిక దోపిడీలు అక్కడ నిత్యకృత్యంగా మారాయని తెలిపింది. 1994 నుంచి రగులుతున్న హింసకు గుర్తుగా ఒక తరం అంతా బాధితులయ్యారని, వాళ్ల జీవితాన్ని కోల్పోయారని వివరించింది.

Advertisement
Advertisement