ఎన్‌టీయూ అధ్యక్షుడిగా సుబ్రా సురేష్‌ | Subra Suresh has been named the president of NTU | Sakshi
Sakshi News home page

ఎన్‌టీయూ అధ్యక్షుడిగా సుబ్రా సురేష్‌

Aug 16 2017 6:58 PM | Updated on Sep 17 2017 5:35 PM

ఎన్‌టీయూ అధ్యక్షుడిగా సుబ్రా సురేష్‌

ఎన్‌టీయూ అధ్యక్షుడిగా సుబ్రా సురేష్‌

ఎన్‌టీయూ అధ్యక్షుడిగా భారతసంతతికి చెందిన సుబ్రా సురేష్‌ ఎంపికయ్యారు.

సింగపూర్‌ :
ప్రెసిడెంట్‌, ముగ్గురు వైస్‌ ప్రెసిడెంట్‌లతో కూడిన నూతన పాలక వర్గాన్ని సింగపూర్‌లోని నన్‌యాంగ్ టెక్నోలాజికల్‌ యూనివర్సిటీ(ఎన్‌టీయూ) బోర్డు ఎంపిక చేసింది. బోర్డు ఛైర్మన్‌ కో బూన్‌ హీ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశంలో ఎన్‌టీయూ అధ్యక్షుడిగా భారతసంతతికి చెందిన సుబ్రా సురేష్‌(61)ని ఏకగ్రీవంగా ఎంపికచేశారు. కార్నెగీ మెలాన్ వర్సిటీ 9వ అధ్యక్షుడిగా సుబ్రా సురేష్ సేవలందించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ శ్రీ అవార్డును 2011లో సురేష్‌ అందుకున్నారు. ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. లొవా స్టేట్ యూనివర్సిటీ, ఎంఐటీలలో ఉన్నత విద్యను అభ్యసించారు.

2018 జనవరి 1న ప్రెసిడెంట్‌, ముగ్గురు వైస్‌ ప్రెసిడెంట్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ బెర్టిల్‌ ఆండర్సన్‌ పదవీవిరమణ అనంతరం ఎన్‌టీయూ నాలుగో ప్రెసిడెంట్‌గా సుబ్రా సురేష్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎన్‌టీయూకు ఎంపికైన ముగ్గురు వైస్‌ ప్రెసిడెంట్‌లు
వైఎస్‌ ప్రెసిడెంట్‌ ఫర్‌ అకాడమిక్స్‌ :  ప్రొఫెసర్‌ లింగ్‌ సన్‌(53)
వైస్‌ ప్రెసిడెంట్‌ ఫర్‌ రీసెర్చ్‌ : లామ్‌ కిన్‌ యోంగ్‌(61)
వైస్ ప్రెసిడెంట్‌ ఫర్‌ అడ్మినిస్ట్రేషన్‌ : థాన్‌ ఎయిక్‌ నా(47)

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement