breaking news
Subra Suresh
-
భారత అమెరికన్లకు అత్యున్నత పురస్కారాలు
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్ అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ అవార్డులు అందుకున్నారు. గాడ్గిల్‌కు వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్, సురేశ్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డులు దక్కాయి. అధ్యక్షుడు జో బైడెన్ వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులతో అందజేశారు. మానవ జీవితాన్ని సుఖవంతం చేసే పలు అమూల్య పరికరాలను కనిపెట్టిన ఘనత గాడ్గిల్ది అంటూ కొనియాడారు. ఇక మెటీరియల్ సైన్స్, ఇతర రంగాల్లో దాని వాడకాన్ని సురేశ్ కొత్త పుంతలు తొక్కించారన్నారు. ఈ అవార్డులను అగ్ర శ్రేణి అమెరికా ఇన్నొవేటర్లకు అందిస్తుంటారు. కింది స్థాయి నుంచి... ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న శాస్త్రవేత్తలిద్దరిదీ కష్టించి కింది స్థాయి నుంచి ఎదిగిన నేపథ్యమే. గాడ్గిల్ 1950లో ముంబైలో జని్మంచారు. అక్కడ, ఐఐటీ కాన్పూర్‌లో ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. యూసీ బర్కిలీ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. 1980లో లారెన్స్ బర్కిలీ ల్యాబ్‌లో చేరారు. ఈ ఏడాదే రిటైరయ్యారు. అక్కడే సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ గౌరవ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. చౌకైన, సురక్షిత తాగునీటి సదుపాయాలు, తక్కువ ఇంధనంతో సమర్థంగా పని చేసే గ్యాస్ స్టౌలు, మెరుగైన విద్యుద్దీపాల అభివృద్ధిలో ఆయన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయి. ముంబైకే చెందిన సురేశ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సారథిగా వ్యవహరించారు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్ అమెరికన్‌గా నిలిచారు. 1956లో పుట్టిన ఆయన ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రెండేళ్లలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1983లో బ్రౌన్ వర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా రికార్డులకెక్కారు. -
ఎన్టీయూ అధ్యక్షుడిగా సుబ్రా సురేష్
సింగపూర్ : ప్రెసిడెంట్, ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లతో కూడిన నూతన పాలక వర్గాన్ని సింగపూర్‌లోని నన్యాంగ్ టెక్నోలాజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ) బోర్డు ఎంపిక చేసింది. బోర్డు ఛైర్మన్ కో బూన్ హీ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశంలో ఎన్టీయూ అధ్యక్షుడిగా భారతసంతతికి చెందిన సుబ్రా సురేష్(61)ని ఏకగ్రీవంగా ఎంపికచేశారు. కార్నెగీ మెలాన్ వర్సిటీ 9వ అధ్యక్షుడిగా సుబ్రా సురేష్ సేవలందించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ శ్రీ అవార్డును 2011లో సురేష్ అందుకున్నారు. ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. లొవా స్టేట్ యూనివర్సిటీ, ఎంఐటీలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 2018 జనవరి 1న ప్రెసిడెంట్, ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ బెర్టిల్ ఆండర్సన్ పదవీవిరమణ అనంతరం ఎన్టీయూ నాలుగో ప్రెసిడెంట్‌గా సుబ్రా సురేష్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్టీయూకు ఎంపికైన ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు వైఎస్ ప్రెసిడెంట్ ఫర్ అకాడమిక్స్ : ప్రొఫెసర్ లింగ్ సన్(53) వైస్ ప్రెసిడెంట్ ఫర్ రీసెర్చ్ : లామ్ కిన్ యోంగ్(61) వైస్ ప్రెసిడెంట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ : థాన్ ఎయిక్ నా(47)