టర్కీ బోటుపై రష్యా యుద్ధనౌక కాల్పులు! | Russia fires on Turkish ship to 'avoid collision' in Aegean Sea | Sakshi
Sakshi News home page

టర్కీ బోటుపై రష్యా యుద్ధనౌక కాల్పులు!

Dec 14 2015 5:13 PM | Updated on Apr 3 2019 5:24 PM

టర్కీ బోటుపై రష్యా యుద్ధనౌక కాల్పులు! - Sakshi

టర్కీ బోటుపై రష్యా యుద్ధనౌక కాల్పులు!

రష్యా, టర్కీ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది.

రష్యా, టర్కీ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ యుద్ధవిమానాన్ని సిరియా సరిహద్దుల్లో టర్కీ కూల్చేయడంతో గుర్రుగా ఉన్న రష్యా.. ఆ దేశంపై కారాలు, మిరియాలు నూరుతోంది. ఈ క్రమంలో తాజాగా రష్యా యుద్ధనౌక ఒకటి టర్కీ పడవపై కాల్పులు జరపడం ఉద్రిక్తతలు మరింత పెంచింది. టర్కీ పడవ ఎదురుగా వస్తూ తమను ఢీకొనేలా ఉండటంతో రష్యా యుద్ధనౌక హెచ్చరిక కాల్పులు జరిపింది. ఆదివారం ఏజియన్ సముద్రంలో లిమ్నస్ గ్రీకు దీవులకు 22 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.

తమ యుద్ధవిమానాన్ని కూల్చేసి ఇద్దరు సైనికులను టర్కీ హతమార్చిందని రష్యా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన తాజా కాల్పుల ఘటనలో టర్కీ పడవ సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా? లేదా? అన్నది ధ్రువీకరించాల్సి ఉందని ఆ దేశ విదేశాంగశాఖ తెలిపింది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాద సంస్థపై దాడుల విషయంలో అమెరికా మద్దతు ఉన్న టర్కీ.. రష్యా తీరును తప్పుబడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement