10 సర్జికల్‌ దాడులతో బదులిస్తాం: పాక్‌ | Pakistan Warns Of 10 Surgical Strikes If India Carries Out Even One | Sakshi
Sakshi News home page

10 సర్జికల్‌ దాడులతో బదులిస్తాం: పాక్‌

Oct 14 2018 4:47 AM | Updated on Oct 14 2018 4:47 AM

Pakistan Warns Of 10 Surgical Strikes If India Carries Out Even One - Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌ తమపై ఒక్క సర్జికల్‌ దాడి  చేస్తే ప్రతీకారంగా తాము అటువంటి 10 దాడులు చేస్తామని పాక్‌ హెచ్చరించింది. పాక్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వాతోపాటు లండన్‌లో మీడియాతో మాట్లాడిన సైన్యం అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ ఈ హెచ్చరికలు చేసినట్లు పాక్‌ రేడియో పేర్కొంది. ‘భారత్‌ చేసే ప్రతి సర్జికల్‌ స్ట్రైక్‌కు సమాధానంగా 10 దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాకు వ్యతిరేకంగా దుస్సాహసానికి పాల్పడాలనుకునే వారు, మా సామర్థ్యాన్ని గురించి సందేహ పడవద్దు’అంటూ వ్యాఖ్యానించారు. దాదాపు రూ.3లక్షల కోట్లతో చేపట్టే చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌(సీపీఈసీ) భారీ ప్రాజెక్టు సంరక్షణ బాధ్యతను సైన్యం తీసుకుంటుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడాన్ని సైన్యం కోరుకుంటోందని ఆ కథనంలో పాక్‌ రేడియో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement