రాజస్తాన్‌లో తప్పిపోయిన ఫ్రెంచ్‌ యువతి

French Woman Missing From Rajasthan For Nearly 2 Weeks - Sakshi

జైపూర్‌ : భారతదేశ పర్యటనకు వచ్చిన 20 ఏళ్ల ఫ్రాన్స్‌ యువతి రాజస్తాన్‌లో రెండు వారాల క్రితం కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని ప్రెంచ్‌ దౌత్యకార్యాలయం దృవీకరించింది. గల్లే ఛౌటీవ్‌ అనే 20 ఏళ్ల ఫ్రెంచ్‌ యువతి, జూన్‌ 1 నుంచి కనిపించడంలేదంటూ ఫ్రాన్స్‌ ఫ్రెంచ్‌ అంబాసిడర్‌ అలాగ్జాండర్‌ ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా రాజస్తాన్‌లో ఫ్రెంచ్‌ యువతి తప్పిపోయిన విషయాన్ని తెలుసుకున్న అజ్మీర్‌ పోలీసు వెంటనే ఈ సమచారాన్ని అన్ని జిల్లా హెడ్‌ క్వాటర్స్‌కు పంపారు. మిస్సింగ్‌ కేసును నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. యువతి ఫోన్‌, ఏటీఎం కార్డ్‌ లాంటి కీలక ఆధారాలను కూడా కనిపెట్టలేదు.

మే 30న రాజస్తాన్‌లోని పుష్కర్‌కు చేరుకున్న యువతి స్థానిక హోలి కా చౌక్‌ అనే హోటల్‌లో దిగింది. జూన్‌ 1న హోటల్‌ ఖాళీ చేసి వెళ్లిన ఆమె అప్పటి నుంచి కన్పించకుండా పోయింది. అయితే హోటల్‌ నుంచి వెళ్లే ముందు తపుకర్‌ అనే ప్రాంతం కోసం వివరాలు అడిగినట్లు, మళ్లీ రెండు వారాల తర్వాత తిరిగి వస్తానని చెప్పి వెళ్లినట్టు హోటల్‌ సిబ్బంది తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతి మిస్సింగ్‌ విషయాన్ని తెలుసుకున్న అజ్మీర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, అందర్ని అలర్ట్‌ చేసినట్లు ఇండియాన్‌-ఫ్రెంచ్‌ దౌత్యకార్యాలయనికి తెలిసేలా అధికారిక ట్వీట్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top