పూనమ్ పాండే హైదరాబాద్లో ఏం చేస్తుందో! | Poonam Pandey come to Hyderabad | Sakshi
Sakshi News home page

పూనమ్ పాండే హైదరాబాద్లో ఏం చేస్తుందో!

Dec 31 2014 4:54 PM | Updated on Oct 17 2018 4:54 PM

పూనమ్ పాండే - Sakshi

పూనమ్ పాండే

బాలీవుడ్ హాటెస్ట్ స్టార్ పూనమ్ పాండే హైదరాబాద్ వచ్చింది. పూనమ్‌ పాండే పేరు వినగానే యువకులకు చిత్ర విచిత్ర విన్యాసాలు గుర్తుకొస్తాయి.

హైదరాబాద్: బాలీవుడ్ హాటెస్ట్ స్టార్ పూనమ్ పాండే హైదరాబాద్ వచ్చింది. పూనమ్‌ పాండే పేరు వినగానే యువకులకు చిత్ర విచిత్ర విన్యాసాలు గుర్తుకొస్తాయి. ఏదో ఒక విధంగా వార్తలలోకి ఎక్కాలని, ప్రచారం పొందాలని అనుకునే ఓ ముద్దు గుమ్మ  కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ మధ్య ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన క్రికెటర్ల కోసం  నగ్న ప్రదర్శన చేస్తానని పూనమ్  తెగ గొడవచేసిన విషయం తెలిసిందే.  సభ్య సమాజం ఒప్పుకోదు కాబట్టి నగ్న ప్రదర్శన చేయలేదు. లేదంటే ఇండియా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ గెలిచినప్పుడు పూనమ్‌ పాండే అన్నంత పని చేసి ఉండేది.

ఎలాగైతేనేం ఆ రకంగా కావలసినదానికంటే ఎక్కువగానే  ప్రచారం పొందింది. వెండితెర అవకాశం దక్కించుకుంది. నషా అనే సినిమాతో యువతకు నిషా ఎక్కించింది. మాలిని అనే తెలుగు సినిమాలో కూడా నటించిన పూనమ్‌  కొత్త సంవత్సరం వేడుకలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ 31 రాత్రి నగరంలో జరిగే తన కార్యక్రమాలకు రావాలని హైదరాబాదీలను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement