ప్రమాదాల్లో సాయం చేసిన వారిని సత్కరిస్తాం | naini narsimhareddy in accidents free day | Sakshi
Sakshi News home page

ప్రమాదాల్లో సాయం చేసిన వారిని సత్కరిస్తాం

Jan 31 2017 3:21 PM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రమాదాల్లో బాధితులకు సహాయం చేసిన వారిని పోలీసు కేసుల్లో సాక్షులుగా పిలవబోమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు.

హైదరాబాద్ : ప్రమాదాల్లో బాధితులకు సహాయం చేసిన వారిని పోలీసు కేసుల్లో సాక్షులుగా పిలవబోమని, క్షతగాత్రులను ఆదుకున్నందుకు అవార్డులతో గౌరవిస్తామని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రమాద రహిత దినం (ఆక్సిడెంట్ ఫ్రీ డే) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇద్దాం.. ప్రమాద రహిత తెలంగాణను కాంక్షిద్దాం.. అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎంఎల్ఏ తీగల కృష్ణారెడ్డి, పోలీసు కమిషనర్‌ మహేష్ భగవతి, జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి, రైల్వే డీజీ కృష్ణప్రసాద్, నటుడు కోట శ్రీనివాస్రావు పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు, ఆందోల్‌ ఎమ్మెల్యే బాబు మోహన్‌ గతంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తన కొడుకును గుర్తు చేసుకుని కంట తడిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement