ప్రాణం తీసిన సరదా... | Fish hunting takes a man live | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన సరదా...

Mar 13 2016 9:23 PM | Updated on Sep 3 2017 7:40 PM

చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.

కాటేదాన్: చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై నాగాచారి తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో చింతల్‌మెంట్ ప్రాంతానికి చెందిన సయ్యద్‌బాబు(20). ఆదివారం కావడంతో సరదాగా చేపలు పట్టేందుకు లక్ష్మీగూడ వాంబేకాలనీలోని కొత్త చెరువుకు వచ్చాడు.

చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. అతనితో పాటు వచ్చిన స్నేహితులు బాబు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. గట్టుపై బాబు చెప్పులను గ్రహించిన స్నేహితులు చెరువులో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బాబు మృతదేహాన్ని వెలికితీసేందుకు రాత్రి 7 గంటల వరకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement