లిఫ్టులో చిక్కుకుపోయిన అడిషనల్ సీపీ | Additional Commissioner of Police Swathi Lakra stuck in lift over 10 minutes | Sakshi
Sakshi News home page

లిఫ్టులో చిక్కుకుపోయిన అడిషనల్ సీపీ

Apr 16 2016 3:51 PM | Updated on Sep 3 2017 10:04 PM

నాంపల్లి సెంట్రల్ క్రైం స్టేషన్ భవనంలోని లిఫ్టు మొరాయించటంతో అడిషనల్ పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు.

హైదరాబాద్ : నాంపల్లి సెంట్రల్ క్రైం స్టేషన్ భవనంలోని లిఫ్టు మొరాయించటంతో అడిషనల్ పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. శనివారం మధ్యాహ్నం ఆమె గ్రౌండ్‌ఫ్లోర్‌కు వెళ్లేందుకు పైనుంచి లిఫ్టులో వస్తున్నారు. అదే సమయంలో మొదటి, రెండో ఫ్లోర్‌ల మధ్యలో లిఫ్టు ఆగిపోయింది. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు పది నిముషాల అనంతరం తిరిగి లిఫ్టును పని చేయించగలిగారు. దీంతో ఏసీపీ స్వాతి లక్రా సురక్షితంగా కిందికి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement