శోభన్‌బాబు హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌ | 2 arrested by police over sobhan babu murder case | Sakshi
Sakshi News home page

శోభన్‌బాబు హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌

Jul 18 2017 2:03 PM | Updated on Sep 5 2017 4:19 PM

వనస్థలిపురంలో ఐదు రోజుల క్రితం హత్యకు గురైన శోభన్‌బాబు కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

హైదరాబాద్: వనస్థలిపురంలో ఐదు రోజుల క్రితం హత్యకు గురైన శోభన్‌బాబు కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హత్యకేసులో నిందితులైన శశిధర్, యాదగిరి అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మీడియా ముందు హాజరుపరిచారు. గత నెలలో గోవాకు వెళ్లి పేకాట ఆడడంతో రూ.లక్షా 30 వేల నగదును యాదగిరి పోగొట్టుకున్నాడు.
 
యాదగిరి, శోభన్‌బాబులు తిరిగి వచ్చేటప్పుడు ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో పథకం ప్రకారం మరికొందరితో కలిసి హత్య చేశాడు. శోభన్‌బాబుకు యాదగిరి చిన్ననాటి స్నేహితుడు. హత్యకు గురైన శోభన్‌ బాబు స్వస్థలం నల్లగొండ. రాజేష్‌, మరికొందరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement