రుణబాధల నుంచి బయటపడాలంటే..?

Jagannatha das instructions - Sakshi

కొందరు అనుకోని ఆర్థిక నష్టాలతోను, రుణబాధలతోను సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే...

శనివారం ఉదయం స్నానం చేశాక మీ ఎత్తుకు సమానమైన పొడవు ఉన్న నల్లదారాన్ని తీసుకోండి. పూజలో ఒక కొబ్బరికాయను నైవేద్యంగా ఉంచి, దానికి ఆ నల్లదారాన్ని పూర్తిగా చుట్టండి. పూజ ముగిశాక ఆ కొబ్బరికాయను ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టండి. ఇలా ఏడు శనివారాలు చేయండి. ఇంట్లోని ఈశాన్యమూలను పరిశుభ్రంగా ఉంచండి. పనికిరాని సామగ్రిని ఈశాన్యమూలలో పడవేయవద్దు.

ఏదైనా సోమవారం ఐదు ఎర్రగులాబీలను, కిలో బియ్యం, పావుకిలో బెల్లం, అంగుళం విస్తీర్ణంలోని పలుచని వెండిరేకుని తీసుకుని, తెల్లని వస్త్రంలో మూటగా కట్టి ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టాలి. ప్రతి బుధవారం ఆవులకు పచ్చగడ్డి తినిపించడం, ప్రతి మంగళవారం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించడం కూడా మంచి ఫలితాలనిస్తుంది. పూజగదిలో స్ఫటిక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి పూజించాలి.  ఇంట్లో డబ్బు భద్రపరచుకునే బీరువా లేదా లాకర్‌లో పదకొండు గోమతి చక్రాలను ఉంచి, వాటికి ప్రతిరోజూ ఉభయ సంధ్యల్లో ధూపం సమర్పించాలి.

 – పన్యాల జగన్నాథదాసు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top