వైఎస్సార్ జనభేరి | ysr janabheri | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ జనభేరి

Apr 20 2014 4:35 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ జనభేరి - Sakshi

వైఎస్సార్ జనభేరి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో నిర్వహిస్తోన్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి జిల్లాకు వస్తున్నారు.

నేటి రాత్రికి వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రాక
 సోమవారం ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభం
 కందుకూరు, సింగరాయకొండ, పర్చూరులలో బహిరంగ సభలు
 విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు  నూకసాని బాలాజీ పిలుపు

 
 సాక్షి, ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో నిర్వహిస్తోన్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి జిల్లాకు వస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం రాత్రి కందుకూరు చేరుకుంటారు. అక్కడే రాత్రికి బస చేసి మరుసటి రోజు సోమవారం ఉదయం 10 గంటల నుంచి యాత్ర ప్రారంభిస్తారు.


 
  అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నానికి సింగరాయకొండ చేరుకుని బహిరంగ సభలో మాట్లాడి సాయంత్రానికి పర్చూరు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కోసం పార్టీ అభ్యర్థులు, శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


 
 జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి ‘వైఎస్సార్ జనభేరి’ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement