breaking news
elctions 2014
-
వైఎస్సార్ జనభేరి
నేటి రాత్రికి వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి జిల్లాకు రాక సోమవారం ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభం కందుకూరు, సింగరాయకొండ, పర్చూరులలో బహిరంగ సభలు విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ పిలుపు సాక్షి, ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో నిర్వహిస్తోన్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి జిల్లాకు వస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం రాత్రి కందుకూరు చేరుకుంటారు. అక్కడే రాత్రికి బస చేసి మరుసటి రోజు సోమవారం ఉదయం 10 గంటల నుంచి యాత్ర ప్రారంభిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నానికి సింగరాయకొండ చేరుకుని బహిరంగ సభలో మాట్లాడి సాయంత్రానికి పర్చూరు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు జగన్మోహన్రెడ్డి పర్యటన కోసం పార్టీ అభ్యర్థులు, శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి ‘వైఎస్సార్ జనభేరి’ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు. -
దేశంలో నరేంద్ర మోడీ గాలి లేదు: బీజేపీ సీనియర్ నేత జోషి
న్యూఢిల్లీ: సొంత పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. దేశంలో నరేంద్ర మోడీ గాలి లేదని, ప్రస్తుతం వీస్తున్నదల్లా బీజేపీ గాలి మాత్రమే అని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న జోషి గుజరాత్ నమూనా అభివృద్ధి అన్ని రాష్ట్రాలకూ సరిపడదన్నారు. ఒక రాష్ట్రానికి చెందిన అభివృద్ధి నమూనాను తాను ప్రోత్సహించబోనని, వివిధ రాష్ట్రాల్లోని మంచి అంశాలను తీసుకుని అభివృద్ధి నమూనాను రూపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఒక పార్టీ ప్రతినిధి మాత్రమే అని, ఆయనకు బీజేపీ నేతలతో పాటు దేశమంతా మద్దతును ఇస్తోందని చెప్పారు. నరేంద్ర మోడీ కోసం తన వారణాసి స్థానాన్ని మురళీ మనోహర్ జోషి వదులుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన మనోరమా న్యూస్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జోషి తాజా వ్యాఖ్యలతో బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి.