నామినేషన్ వేసేందుకు బీఎస్పీ ఎంపీకి బెయిల్ | Supreme Court grants bail to BSP MP for filing nomination papers | Sakshi
Sakshi News home page

నామినేషన్ వేసేందుకు బీఎస్పీ ఎంపీకి బెయిల్

Apr 9 2014 9:01 PM | Updated on Aug 14 2018 4:21 PM

నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా... పనిమనిషి హత్య కేసులో జైల్లో ఉన్న బీఎస్పీ ఎంపీ ధనుంజయ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

న్యూఢిల్లీ: నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా... పనిమనిషి హత్య కేసులో జైల్లో ఉన్న బీఎస్పీ ఎంపీ ధనుంజయ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తిరిగి అదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు.

నామినేషన్ దాఖలుతోపాటు ప్రచారం నిర్వహించుకోవడానికి వీలుగా ధనుజంయ్‌సింగ్‌కు ఈ నెల 14 నుంచి 21 వరకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీఎస్ చౌహాన్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు బెంచ్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ధనుంజయ్, ఆయన భార్య జాగ్రితి... తమ ఇంటి పనిమనిషి రాఖీబాంద్రా(35) హత్య కేసులో గతేడాది నవంబర్‌లో అరెస్టయ్యి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ధనుంజయ్ ఒక అత్యాచార కేసులోనూ నిందితుడిగా ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement