వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి బీభత్సం సృష్టించింది.
అనంతపురం: వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఎన్‌ఎస్‌పీ కొట్టాల వద్ద శనివారం ఉదయం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి వ్యాన్ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.