
తెలంగాణ పోలీస్ నంబర్‌వన్
శాంతిభత్రలనుకాపాడడంలో పోలీసులు మంచి ప్రావీణ్యం చూపుతున్నారని , కేంద్ర హోంశాఖ మంత్రి దీనిని స్వయంగా పరిశీలించారని, దేశంలో తెలంగాణ పోలీస్ విధానం నంబర్‌వన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నారుు ని నర్సింహారెడ్డి అన్నారు.
► రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
► శాంతిభద్రతల నిర్వహణకు సర్కారు ప్రాధాన్యం
► మంత్రి కె.తారకరామారావు
► సర్దార్‌పూర్‌లో 17వ బెటాలియన్‌కు శంకుస్థాపన
సిరిసిల్ల క్రైం : శాంతిభత్రలనుకాపాడడంలో పోలీసులు మంచి ప్రావీణ్యం చూపుతున్నారని , కేంద్ర హోంశాఖ మంత్రి దీనిని స్వయంగా పరిశీలించారని, దేశంలో తెలంగాణ పోలీస్ విధానం నంబర్‌వన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నారుు ని నర్సింహారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్ధాపూర్‌లో 17వ పోలీస్ బెటాలియన్‌కు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అనంతరం పోలీసు విధానంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ఒకప్పుడు పోలీసులంటేనే ప్రజలు భయాందోళనలో ఉండేవారని, దానిని మార్చి స్నేహపూరిత పోలీసు విధానాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోలీస్ బెటాలియన్ సాధించడంలో మంత్రి కేటీఆర్ కృషి ఉందన్నారు.
గోదావరి, కృష్ణా పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం, హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రులను శాంతియుతంగా నిర్వహించడంలో పోలీసుల పనితీరు అభినందనీయమన్నారు. నేరాలను అదుపు చేయడానికి సాంకేతికతను వాడుకుంటున్నామని, సీసీ కెమెరాలు, షీ టీంల ఏర్పాటుతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆధునిక పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల తప్పు చేసే వారిలో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. పోలీసుల అవసరాలకు వివిధ స్థారుుల్లో కార్యాలయాలు ఏ ర్పాటు చేస్తున్నామని, అందు లో వ్యాయామశాల ఏర్పాటు చేసి పోలీసుల ఫిట్‌నెస్‌కు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్యాయం జరిగితే సంబంధిత ఠాణాలో ఫిర్యాదు ఇవ్వడంతోపాటు ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేస్తే ఉన్నతస్థారుు అధికారులకు అది చేరుతోందని, దాంతో సత్వర న్యాయం జరగుతుందని అన్నారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేశామని చెప్పారు. 130 ఎకరాల్లో అన్ని హంగులతో రెండేళ్లలో బెటాలియను పూర్తి చేస్తామన్నారు. రెండున్నరేళ్లుగా మత సామరస్యంతో ముందుకు సాగుతున్నామని, గత పాలనతో పోల్చితే నేడు క్రైం రేటు తగ్గిందని, దానికి కారణం పోలీస్ విధానంలో పటిష్టమైన చర్యలని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ బెటాలి యన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.