సిరిసిల్ల రూరల్: సిరిసిల్ల జిల్లా చేయాలని డిమాండ్‌తో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిరిసిల్ల మండలం తాడూరు గ్రామ సర్పంచ్ గుర్రం వెంకటలక్ష్మీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
సిరిసిల్ల జిల్లా కోసం సర్పంచ్ రాజీనామా
Aug 25 2016 11:33 PM | Updated on Nov 6 2018 4:04 PM
సిరిసిల్ల రూరల్: సిరిసిల్ల జిల్లా చేయాలని డిమాండ్‌తో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిరిసిల్ల మండలం తాడూరు గ్రామ సర్పంచ్ గుర్రం వెంకటలక్ష్మీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాలను సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ముందు అడ్వకేట్ జేఏసీ దీక్షా శిబిరంలో ప్రదర్శించారు. తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో, డీపీవోకు పంపించనున్నట్లు తెలిపారు. దీంతో గుర్రం వెంకటలక్ష్మీ పదవీ త్యాగాన్ని అడ్వకేట్ జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంత్, మహేశ్‌గౌడ్, ధర్మేందర్, కోడి లక్ష్మణ్, కుంట శ్రీనివాస్ అభినందించారు. ఇప్పటికైన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇండ్లలో నుంచి బయటకు రావాలని, గుర్రం వెంకటలక్ష్మీ లాగా పదవులు త్యాగం చేస్తే జిల్లా సాధ్యమన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రకటించే వరకు పోరాడుతామని తాడూరు సర్పంచ్ గుర్రం వెంకటలక్ష్మీ తెలిపారు.
Advertisement
Advertisement