నిమ్స్‌ కౌంటర్‌లో రూ.40 వేలు చోరీ | NIMS counter the theft of Rs 40 thousand | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ కౌంటర్‌లో రూ.40 వేలు చోరీ

Sep 7 2016 9:28 PM | Updated on Sep 4 2017 12:33 PM

మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నిమ్స్‌ ఆసుపత్రి ఓపీలో రెప్పపాటులో రూ. 40 వేలు చోరీ చేసింది.

పంజగుట్ట: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నిమ్స్‌ ఆసుపత్రి ఓపీలో రెప్పపాటులో రూ. 40 వేలు చోరీ చేసింది. అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా గార్డు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం ... నాంపల్లికి చెందిన గౌసియా బేగం (32) బుధవారం మధ్యాహ్నం నిమ్స్‌ ఆసుపత్రి ఓపీ వద్దకు వచ్చింది.

ఓపీలోని ఓ మహిళా ఉద్యోగి పక్కనే ఉన్న మరో ఉద్యోగితో మాట్లాడుతుండగా సెకండ్ల వ్యవధిలో కౌంటర్‌లో ఉన్న రూ. 40 వేలు దొంగిలించింది. అక్కడే విధుల్లో ఉన్న మహిళా గార్డు ఇది గమనించి వెంటనే గౌసియా బేగంను పట్టుకుంది. అప్పటికే ఆమె మద్యం మత్తులో ఉన్న ఆమెను నిమ్స్‌ సెక్యూరిటీ అధికారులు పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement